విజయనగరంలో క్లియర్ అలైన్సర్స్ (Clear Aligners)
క్లియర్ అలైన్సర్స్ (Clear Aligners) అనేవి వంకర పళ్ళను సరైన అమరికలోకి తీసుకురావడానికి ఉపయోగించే ఆధునిక పారదర్శక ప్లాస్టిక్ ట్రేల వ్యవస్థ. సాంప్రదాయ మెటల్ బ్రేసెస్ (పంటి క్లిప్పులు) మాదిరిగా ఇనుప తీగలు లేదా బ్రాకెట్లు లేకుండా, ఇవి పంటిపై సహజంగా అమరిపోయి బయటకు కనిపించవు.
నోటిలో అసౌకర్యంగా ఉండే పాతకాలపు పుట్టీ ఇంప్రెషన్స్ లేకుండా, ఆధునిక 3D ఇంట్రారల్ స్కానర్ ద్వారా పళ్ళ కొలతలను డిజిటల్‌గా రికార్డ్ చేస్తారు. కంప్యూటర్ సిమ్యులేషన్ ద్వారా చికిత్స పూర్తయిన తర్వాత మీ నవ్వు ఎలా ఉంటుందో ముందుగానే చూడవచ్చు.